శ్రీకాకుళం : డిసెంబర్ 4: రైసుమిల్లర్లు నిజాయితీగా వ్యాపారం చేయాలని, వారికి ప్రభుత్వం తరపున తాను అండగా నిలుస్తానని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి, శ్రీకాకుళం జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ శాశ్వత అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ లో బుధవారం జరిగిన జిల్లా రైస్మిల్లర్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , జిల్లాలో ఏ మంచి కార్యక్రమం జరిగినా, విపత్తు సంభవించినా ఆపన్న హస్తం అందించేందుకు రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటుందన్న గౌరవం ఉందన్నారు. రైస్ మిల్లర్లంతా ఐక్యంగా ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. తాను కూడా ఒక రైసుమిల్లర్ గా జిల్లాలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి , రాష్ట్ర కమిషనర్‌కు వివిరించడం జరిగిందన్నారు . అసోసియేషన్‌కు అనుబంధంగా ఉన్న రైతుల బాగోగుల చూడాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. ఇతర జిల్లాల వ్యాపారులు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడాన్ని నిలువరించాల్సి ఉందని, రైతుకు నష్టం జరిగితే రైతుగా ముందు తానే అడ్డుకుంటానని స్పష్టం చేశారు . ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి న్యాయమైన ఏ పనికి అడ్డుచెప్పరని , మిల్లర్లంతా నీతి నిజాయితీలతో వ్యాపారం చేయాలని , వారికి దాసన్న అండగా ఉంటారని భరోసానిచ్చారు . ఈ సందర్భంగా మంత్రి కృష్ణదాస్ ను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు . రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్విఎస్ వెంకటేశ్వరరావు (వాసు) అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో టెక్కలి నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి పేరాడ తిలక్ , అసోసియేషన్ సభ్యులు కింజరాపు హరివరప్రసాద్, ఐ . జనార్థనరావు, కె.వి. గోపాలకృష్ణ , తాళాసు కృష్ణారావు , తంగుడు నాగేశ్వరరావు , టంకాల అర్జున్ బాబు , పాగోటి రాములు , శాసనపురి కుమారస్వామి , ముద్దాడ సూర్యనారాయణ , అంధవరపు ధనుంజయ , రాంబాబు , కోరాడ శంకర్కుమార్, ప్రియా విజయకుమార్ , కృష్ణమూర్తి , భూషణరావు , నరసింహమూర్తి , బి.రమేష్ , టి.జోగారావు, లాడె రమేష్, జోగి శెట్టి తదితరులు పాల్గొన్నారు .
నిజాయితీగా వ్యాపారం చేసుకోండి మీకు అండగా ప్రభుత్వం ఉంది :మంత్రి దర్మాన