ఆర్.వి.ఎం ప్రొజెక్ట్ అధికారిగా పి.వి.రమణ

శ్రీకాకుళండిసెంబర్ 13 : రాజీవ్ విద్యా మిషన్ ప్రోజెక్ట్ అధికారిగా పైడి వెంకటరమణ నియమితులయ్యారు. శుక్రవారం ఉదయం పి.ఓగా బాధ్యతలను చేపట్టిన ఆయన కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో డెమో( డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ మీడియా ఆఫీసర్ )గా విధులు నిర్వహిస్తూరాజీవ్ విద్యా మిషన్ ప్రోజెక్ట్ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు. 1986 జనవరి 19న మెడికల్ అండ్ హెల్త్ సర్వీసులో చేరిన ఆయన 1998 జూన్ 14న ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ అధికారి హోదాలో డిప్యూటీ డెమోగా పనిచేశారు. సెకండ్ లెవెల్ గెజెటెడ్ అధికారి హోదాలో  2016 జూన్ 10న విశాఖపట్నం రీజనల్ మేల్ ట్రైనింగ్ సెంటర్ నందు హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్సటెన్షన్ అధికారిగా పదవీ బాధ్యతలను చేపట్టడం జరిగింది. తదుపరి శ్రీకాకుళం వైద్య ఆరోగ్య శాఖలో డెమోగా బదిలీ కాబడి విధులు నిర్వహిస్తున్న రమణ శుక్రవారం ఆర్.వి.ఎం ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో ప్రభుత్వ లక్ష్యాలను సాధించి జిల్లాకు మంచి పేరును తీసుకురావడానికి కృషిచేస్తానని అన్నారు.