రైతులకు పాడిపశువుల పెంపకంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది : అదనపు సంచాలకులు సింహాచలం

శ్రీకాకుళం : రైతలను పశు సంవర్ధక రంగం వైపు నడిపించడం ద్వారా గ్రామీణ స్వీయ ఉపాధి ఆర్థిక పరిపుష్ఠిత సాదించగలమని, అందుకు గ్రామ సచివాలయం ద్వారా పశు సంవర్ధక సహాయకులు కృషిచేయాలని పశు సంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డా.ఎండ సింహాచలం అన్నారు.శ్రీకాకుళం పశు సంవర్ధక శిక్షణ కేంద్రంలో పశు సంవర్ధక సహాయకులకు జరుగుతున్న 6 రోజుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అధితిగా పాల్గొన్నారు. గ్రామీణ యువత,మహిళలు, నిరుద్యోగులు  పాడి,గొర్రెలు, మేకలు,కోళ్ల పెంపకం వంటి పశు సంవర్ధక స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొనేలా,గ్రామాల్లో విస్తృతంగా అవగాహన చెయ్యాలని,రైతులకు శాస్త్రేయ అవగాహన కల్పించడంతో పాటు సాంకేతికంగా సహాయ సహకారాలు అందించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో చురుకుగా పాల్గొని ప్రభుత్వ పథకాలు రైతులకు అందేలా చేసి,ప్రభుత్వ ఆశయాన్ని సఫలీకృతం చెయ్యాలని అన్నారు. వ్యాధి బారిన పడిన పశువులకు పశువైద్యుల సహకారంతో చికిత్సలు చేస్తూ,వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వెయ్యడం,గర్భకోస చికిత్స శిబిరాలు నిర్వహించడంలో నిరంతరం శ్రామిస్తూ, పశు సంవర్ధక శాఖకు మంచి పేరు తేవడంలో అందరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. జిల్లా సంయుక్త సంచాలకులు డా.ఈశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 790 గ్రామ సచివాలయాలలో పశు సంవర్ధక సహాయకులు గాను 268 మందిని నియమించామని,190 రైతు భరోసా కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన సహాయకులతో వారు నిర్వహించవలసిన భాద్యతలు, రైతులతో మమేకమైన విధానాలు పై చర్చించినారు. ఈ కార్యక్రమంలో ఉపసంచాలకులు డా.జగన్నాధం,ప్రసాదరావు, సహాయ సంచాకులు డా.మోహిణికుమారి, మాణిక్యాలరావు, బాలక్రిష్ణ, రాజశేఖర్,నారాయరావ్,పశు వైదులు డా.శ్రీనివాస్, డా.సురేష్,దిలీప్ సిబ్బంది పాల్గొన్నారు.