తిరుపతి : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో నాటు బాంబులు కలకలం రేపాయి. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సమీపంలో పొదల్లో నుంచి ఓ కుక్క నాటు బాంబును నోట కరచుకుని బయటకు తెచ్చింది. దీంతో ఒత్తిడికి గురై ఆ నాటు బాంబు ఒక్కసారిగా పేలింది. దీంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. భారీ శబ్ధం రావడంతో ఆస్పత్రి సిబ్బందితోపాటు రోగులు భయాందోళనలకు గురయ్యారు. పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తిరుపతిలో నాటు బాంబుల కలకలం