నేడు ఎం.ఎస్.ఎం.ఇ బిజినెస్ మీట్

శ్రీకాకుళం : డిశంబరు 20 సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమల బిజినెస్ మీట్ ను శనివారం నిర్వహిస్తున్నట్లు  ఏపి రాష్ట్ర ఆర్ధిక సంస్ధ సీనియర్ మేనేజర్ ఏ.ఎస్.వెంకట రావు తెలిపారు. ఈ మేరకు శుక్ర వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ శని వారం ఉదయం 10 గంటల నుండి శ్రీకాకుళం ఏపి రాష్ట్ర ఆర్ధిక సంస్ధ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వెంకట రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెట్టుబడులు పెట్టుటకు అవకాశం గల పరిశ్రమల వివరాలు, పూర్వ పారిశ్రామిక వేత్తల అనుభవాలు, దక్షత, మార్కెటింగు మెళుకవలు, పెట్టుబడులు, సెక్యూరిటి తదితర వివరాలతోపాటు రుణాలు మంజూరులో పాటించే నియమాలు తదితర అంశాలను వివరించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేయు విధానాలను, రుణ సౌకర్యాలను తెలియజేస్తూ అందుకు అనుగుణంగా చేపట్టవలసిన చర్యలను తెలియజేయడం జరుగుతుందని అన్నారు.