శ్రీకాకుళం : డిశంబరు 2 : శ్రీకాకుళం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఒక జిల్లా ముఖ్యపట్టణం. మనిషి నిత్యజీవితంలో రెండు చక్రాల వాహనాలు అలాగే నాలుగు వాహనాలు ప్రయాణానికి ఒక భాగం అయ్యాయి.అవీ లేని వారు పట్టణంలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళాలంటే మూడు చక్రాల వాహనాలు విరివిగా దొరుకుతాయి.వారు వారి వ్యాపారమే ప్రధాన ధ్యేయంగా మనిషి కనిపించే చోట ఆపుతూ వెలుతూ నానాటికి పెరుగున్న ట్రాఫిక్ సమస్యలలో ప్రధములు అని చెప్పక తప్పదు.అలాగే కళాశాల పిల్లలు,రోజు వారీ వ్యాపారం చేసే వారు అవసరాలకు వివిధ ప్రాంతాలనుండి వచ్చిన వారు కూడా ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలతో ఈ మధ్య చాలా ఇబ్బందులు ఎదుర్కొని నగరం దాటడానికి,నగరంలో ఆఫీసుకు వెళ్ళే ఉధ్యోగులు సమయానికి చేరడానికి అతిక్లిష్టంగా మారింది.ఆ ట్రాఫిక్ సమస్యలను తీర్చి క్రమంగా వాహనాలు వెళ్ళేందుకు స్థానిక పోలీసు శాఖకు కూడా పెనుభారంగా మారింది.అయితే ఈ సమస్య తీర్చాల్సిన సిబ్బంది కొందరు అత్యుత్సాహ ప్రదర్శనతో మరి కొంత సమస్యగా మారడం పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారు.ఈ సోదంతా ఏమిటంటే ఈ మధ్య కాలంలో ఇ-చలాణా పద్ధతి రావటంతో వాటిపై ఇప్పటికే కొంత అవగాహన కల్గిన వాహనదారులు ఎంతో కొంత జాగ్రత్త పడ్డారనే చెప్పవచ్చును.ఎందుకంటే రాంగ్ పార్కింగ్,అలాగే వేగాన్ని పసికట్టే కెమేరాలవలన వారు ఆ ఫొటోకి దొరికిన తప్పకుండా ఆ బండి నెంబరు కల యజమానికి తనకు తెలియకుండానే ఫైన్ వేయడం జరుగుతుంది.ఆ ఫైన్ మీ-సేవ,లేదా నెట్ బాంకింగ్ ద్వారా వారు చెల్లించవలసిన అవసరం ఉంది.అది కొంతవరకు వాహన యజమానులు ఎప్పటికప్పుడు ఇ-చలాన్ ఆంధ్రప్రదేశ్ లో చూచి కట్టడం జరుగుతుందనే చెప్పవచ్చును.అలా అపరాధ రుసుము చెల్లింపు చేయడం లేటు అయినా లేదా విస్మరించినా వారి వాహనం నెంబరు నిత్యం వారు తిరిగే పోలీసు స్టేషన్ లో తెలుస్తుంది.ఆ నెంబరు గల వాహనదారుడు ఎప్పుడు ఎక్కడ సంచరించినా వారిని ప్రక్కకు తీసి మీ వాహనంపై అపరాధ రుసుము నమోదు అయ్యింది మీరు కట్టాలి అని చెప్పాల్సిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అందరినీ ఆపి మరీ మీ వాహనంపై అపరాధ రుసుము నమోదు అయ్యిందో లేదో చూస్తామని అందరినీ ఆపటం పట్ల వాహన యజమానులు విసుగు చెందుతున్నారు.మరి ఇలా వారు చేయాలంటే పట్టణంలో కాకుండా చివారు ప్రాంతాలలో చేసి అందరికీ అవగాహన కల్పించిన బాగుంటుంది అని, కొందరు గుసగుసలాడుతున్నారు. దీనిపై అధికారులు స్ఫందించి ట్రాఫిక్ సమస్యను తేర్చేందుకు బదులుగా సమస్య తెస్తుండటం మంచిది కాదని ఆనోటా ఈనోటా మాట్లాకుంటున్నారు.అన్నట్లు ఈ సమస్య ఎక్కడ జరుగుతుంది చెప్పలేదు కదా ? అదేనండి నిత్యం ఈ సమస్యతో మనం విసుగు చెందుతున్న రామలక్ష్మణ దియేటర్ దగ్గరండీ.
ట్రాఫిక్ సమస్య తీర్చాల్సిన అధికారులే ట్రాఫిక్ సమస్యకు "ప్రధాన సమస్య "