న్యూఢిల్లీ : లోక్‌కళ్యాణ్ మార్గంలోని ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి 9 ఫైరింజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి సంబంధించి అధికారులు ఇంతవరకు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.
ప్రధాని నివాసంలో అగ్నిప్రమాదం