అనకాపల్లి : డిసెంబరు 5 : హౌరా-చెన్నై మధ్య రైల్వే మూడో లైన్ మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా చెప్పారు. బుధవారం ఆయన అనకాపల్లి, తుని రైల్వేస్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి సరుకు రవాణా పెరిగిందని, అందువల్ల మూడో రైల్వే లైన్ అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తమ పరిధిలోని కొన్ని స్టేషన్లలో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని ప్రతిపాదనలు అందాయని, వాటిని రైల్వేబోర్డుకు పంపామని చెప్పారు.
హౌరా చెన్నై మధ్య మూడవ రైల్వే లైన్