శ్రీకాకుళం : డిశంబరు 5 : రాష్ట్ర రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనజిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన రావు సేవాతత్పరుడు అని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. గురు వారం శాంతా కళ్యాణ అనురాగ నిలయంలో జగన్మోహన రావుకు ఆత్మీయ అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు ప్రసాద రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు సమాజానికి అవసరమన్నారు. స్వచ్ఛంద సేవల ద్వారానే అనేక పనులు విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. సేవాతత్వమే నిజమైన నాయకత్వం అన్నారు. ఈ నాయకత్వ లక్షణాలు జగన్మోహన రావులో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. సేవలు చేసే స్ఫూర్తిని సమాజంలో నింపాలని తద్వారా కొంత మంది సేవా కార్యక్రమంలో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులుగా రావడం జిల్లాకు గౌరవ ప్రదమని పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తికి అభినందించడం, సన్మానించడం ద్వారా మరింత మంది స్ఫూర్తి పొందగలరని ఆయన అన్నారు. జిల్లాలో గుర్తించిన సమస్యల పరిష్కారంపై పని చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో యువ నాయకుడు అనేక కార్యక్రమాలను అమలు చేయుటకు ఆకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారని, ఆర్ధిక సమస్యలు ఉన్నా రానున్న రోజుల్లో సర్ధుకుంటాయని అన్నారు.
సేవాతత్పరుడు రెడ్ క్రాస్ జగన్మోహన రావు