చెన్నై : డిశంబరు 12 : ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. ఆయనకు 80 సంవత్సరాలు నిండాయి. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.1939 ఏప్రిల్ 14న విజయనగరంలో గొల్లపూడి జన్మించారు. గొల్లపూడికి ముగ్గురు కుమారులు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కొన్నాళ్లు పనిచేశారు.1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉపసంచాలకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. గొల్లపూడి మారుతీరావు దాదాపు 290కిపైగా చిత్రాల్లో నటించారు. ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. సినీ రంగంలో మొదటి రచన 'డాక్టర్ చక్రవర్తి'కి ఉత్తమ రచయితగా నంది పురస్కారం అందుకున్నారు.పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా గొల్లపూడి రచనలు విద్యార్థులకు బోధిస్తుండటం విశేషం. సంసారం ఒక చదరంగం, తరంగిని, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దులప్రియుడు, ఆదిత్య 369 మొదలైన చిత్రాల్లో నటించారు.
ప్రముఖ నటుడు రచయిత ఇకలేరు