శ్రీకాకుళం : డిశంబరు 2 : దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ట్రైసైకిళ్ళను పంపిణీ చేసారు.సోమవారం స్పందన కార్యక్రమంలో తమకు ట్రై సైకిళ్ళు కావలసినదిగా కోరుతూ, దరఖాస్తు చేసిన అయిదుగురు విభిన్న ప్రతిభావంతులకు ఆ శాఖ ద్వారా ట్రైసైకిళ్ళను మంజూరు చేయడం జరిగింది. స్పందన కార్యక్రమం అనంతరం రేగిడి ఆమదాల వలస గ్రామానికి చెందిన కెంబూరు రాధ, జలుమూరు మండలం సురవరం గ్రామానికి చెందిన ఎస్. సంతుకుమార్, సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన డి.గారప్పడు, ఎన్.సిమ్మడు, చింతాడ కు చెందిన డి.మహేశ్ లకు ట్రైసైకిళ్ళను పంపిణీ చేసారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయసంచాలకులు జీవన్ బాబు కలెక్టర్ తో పాటు ట్రైసైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దివ్యాంగులకు ట్రైసైకిళ్ళు పంపిణీ