శ్రీకాకుళం : డిశంబరు 20 : నేడు నేతన్న నేస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించనున్నట్లు హేండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ సహాయ సంచాలకులు ఎం.పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. నేతన్ననేస్తం కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించనున్నారని తెలిపారు.స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేతదారునికి వై.ఎస్.ఆర్.నేతన్న నేస్తం పథకం క్రింద ఏడాదికి రూ.24,000 లు ఆర్ధిక సాయాన్ని అందచేయనున్నారని తెలిపారు.జిల్లాలోని పొందూరులో ఈ కార్యక్రమాన్ని శాసన సభాపతి ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లాలో 1,457 మంది చేనేత కార్మికులకు ఈ పథకం క్రింద ఆర్ధిక సాయాన్ని అందించడం జరుగుతుందని ఆమె ఆ ప్రకటనలో తెలిపారు.
నేడు వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం ప్రారంభం