శ్రీకాకుళం :డిశంబరు 3 : డిశంబరు 14వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ అధ్యక్షులు మరియు జిల్లా న్యాయమూర్తి ఎమ్. బబిత పేర్కొన్నారు. మంగళవారం ఉదయ జిల్లా బార్ అసోసియేషన్ భవనంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్ధ వారి ఆధేశాలు మేరకు డిశంబరు 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ లోక్ అదాలత్ కార్యా క్రమానికి న్యాయవాధులు సహకరించి జిల్లాను ప్రధమస్థానంలో నిలపాలని కోరారు.14వ తేదీన జరగనున్న లోక్ అదాలత్ లో రాజీ పడడానికి 850 కేసులు సిద్దంగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇందులో ప్రభుత్వ భూసేకరణకు సంబంధించిన కేసులు కూడా ఉన్నట్టు తెలిపారు. 2019 సెప్టంబరు 14వ తేదీన జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా వ్యాప్తంగా 1155 పెండింగ్ కేసులు, 31 ప్రీలిటిగేషన్ కేసులను రాజీ మార్గంమున పరిష్కరించి రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా 7వ స్థానంలో నిలిచిందని చెప్పారు.జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సెక్షన్ 138 నెగేషియబుల్ ఇనుస్ర్టుమెంట్స్ యాక్టు కేసులు, మోటారు యాక్సిడెంట్ క్లేయిమ్ కేసులు, ఫ్యామిలీ కోర్టు కేసులు, లేబర్ కేసులు, ప్రభుత్వ భూసేకరణ కేసులు, బ్యాంకు కేసులు, సివిల్ కేసులు, రెవెన్యూ కేసులు, ఇతర రేవెన్యూ కేసులు, సర్వీసు మేటర్స్, పాత పెండింగ్ కేసులు, ప్రీలిటిగేషన్ కేసులు రాజీమార్గము ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జిల్లా ప్యాప్తంగా 17 లోక్ అదాలత్ బెంచ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇవి శ్రీకాకుళం జిల్లా కోర్టు సముదాయంలోను, మరియు ఆమదాలవలస, ఇచ్పాపురం, కోటబోమ్మాళి, నరసన్నపేట, పాలకొండ, పలాస, పాతపట్నం, రాజాం, సోంపేట, టెక్కలి, కొత్తూరు, పొందూరు కార్టు సముదాయంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కావున కక్షదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ప్రధాన కార్యదర్శి కె. జయలక్ష్మీ ఆద్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో 1వ అదనపు జిల్లా న్యాయముర్తి వి.ఎస్. అంజనేయ మూర్తి, ఫ్యామిలీ కోర్టు 3వ అదనపు జిల్లా న్యాయముర్తి పి. అన్నపూర్ణమ్మ, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ సి.బి. సత్యన్నారాయణ, న్యామూర్తులు పి.వి ప్రసాద్, ఆర్. శాంతి, ఎల్. దేవీరత్నకుమారి, మొబైల్ మేజిస్ట్రేట్ జి. దేవిబాబు, ఎగ్జక్యూటివ్ మెజిస్ట్రేట్ జె. కిషోర్ కుమార్, రాజాం జూనియర్ సివిల్ జెడ్జి జి. స్వాతి, పాలకొండ జూనియర్ సివిల్ జెడ్జి షేక్ జయుద్ధీన్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిస్టు రమేష్, వైస్ ప్రెసిడెంట్ జి. రాధారాణి, సెక్రటరీ జి.ఎస్.కె. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి