నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు

శ్రీకాకుళం :డిశంబరు 10 : నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం సంయుక్త కలెక్టర్ ఛాంబరులో ధరల నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జె.సి. కూరగాయలు, అపరాలు, నూనెలు తదితర నిత్యావసర వస్తువుల ధరలపై సమీక్షించారు.గతేడాది కన్నా కందిపప్పు, పెసరపప్పు, ధరలు స్వల్పంగా పెరిగాయని, మినప్పప్పు చింతపండు ఆయిల్స్ ధరలు క్రితం సంవత్సరం కన్నా ఈ ఏడాది ధరలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.పంచదారకు  అదే ధర వున్నదని చెప్పారు. కూరగాయల ధరలు బాగా తగ్గాయన్నారు. ముఖ్యంగా  పచ్చిమిర్చి, టమోటో, వంగ, బెండ, క్యాబేజీ, దొండ, బంగాళాదుంపల ధరలు బాగా తగ్గాయన్నారు.రైతు బజారులో ఓపెన్ మార్కెట్ రేట్ల కన్నా తక్కువ ధరలకు కూరగాయలను  విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఉల్లిపాయలు ఈ ఏడాది పంటదిగుబడులు తగ్గడంతో ఓపెన్ మార్కెట్టులో ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతన్నదని  తెలిపారు. ప్రజలకు అందుబాటులోకి ఉల్లిని తక్కువ ధరకు అమ్మడానికి చర్యలు తీసుకోవడం జరుగుతన్నదన్నారు.కర్నూలు నుండి తెప్పించి జిల్లాలోని మూడు రైతు బజార్లలో 25 రూపాయలకు కిలో చొప్పున ఉల్లిపాయలను  ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నదన్నారు. బ్లాక్ మార్కెట్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.నాలుగు తుఫానులు రావడం వలన దేశంలోనే ఉల్లి పంట దిగుబడి తక్కువగా వున్నందున  కొరత ఏర్పడిందన్నారు.జనవరి మొదటి వారం నాటికి పూర్తిగా ఉల్లి ధర నియంత్రణలోకి వస్తుందని చెప్పారు.పది, పదిహేను రోజులలో కొత్త పంట వస్తుందని ప్రజలు గమనించాలని కోరారు. గిరిజన ప్రాంతాలలో జి.సి.సి ద్వారా ఉల్లి సరఫరాకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రైతుబజార్లలోను, ఓపెన్ మార్కెట్ లోను ప్రతీ రోజు ధరల పట్టికను ప్రజలకు అందుబాటులో వుంచాలన్నారు.ఈ సమావేశానికి పౌర సరఫరాల అధికారి జి.నాగేశ్వర రావు, మార్కెటింగ్ శాఖ  సహాయ సంచాలకులు బి.శ్రీనివాస రావు,ఉద్యాన వన శాఖ సహాయ సంచాలకులు జి.వి.వి.ప్రసాద రావు, అసిస్టెంట్ కమర్షియల్  టాక్స్ ఆఫీసర్ డి.నానాజీ రెడ్డి,  ఎస్టేట్ మేనేజర్ రాజశేఖర్,   రైస్ మిల్లర్ల అసోసియేషన్ పి.ఆర్.ఓ. లాడె రమేష్, కార్యదర్శి చంటి,హోల్ సేల్ వ్యాపారులు,