ఎంపీ సీఎం రమేశ్ కుటుంబంలో విషాదం

హైదరాబాద్ : బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కుటుంబంలో విషాదం నెలకొంది. సీఎం రమేశ్ సోదరుడు ప్రకాశ్ నాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రకాశ్ నాయుడు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వీరి స్వస్థలం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి. ఆరంభం నుంచి సీఎం రమేశ్‌కు ప్రకాశ్ నాయుడు అండగా నిలిచారు. సీఎం రమేశ్ టీడీపీలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రకాశ్ నాయుడు మృతి విషయాన్ని తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలిపారు.