రైతు బజారులో పారదర్శకంగా ఉల్లి విక్రయం

శ్రీకాకుళం : డిశంబర్ 8: రైతు బజార్లలో ఉల్లిపాయల విక్రయాలు పారదర్శకంగా జరుగుతున్నాయని  జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం స్థానిక రైతు బజార్ లో ఉల్లి విక్రయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లి ధర 100 నుండి  150  రూపాయల వరకు  ఉండగాసామాన్యులకు అందుబాటులో ఉల్లి ఉండాలనే లక్ష్యంతో  ప్రభుత్వం రైతు బజార్ ల ద్వారా కేజీ  ఉల్లిపాయలు 25 రూపాయలకే విక్రయిస్తోందని తెలిపారు. రైతు బజార్ లో  మూడు కౌంటర్లు పెట్టడం జరిగిందన్నారు. వృద్ధులకు మరియు దివ్యంగులకు  ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. మహిళలకుపురుషులకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయడం  జరిగిందన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో  మార్కెటింగ్ సహాయ సంచాలకులు బి. శ్రీనివాసరావు,  రైతు బజార్ ఎస్టేట్  మేనేజర్  రాజశేఖర్  తదితరులు పాల్గొన్నారు.