వన్యప్రాణుల రక్షణకి విద్యార్థులు సమాయత్తం కావాలి

శ్రీకాకుళం : డిశంబరు 9 : వన్యప్రాణుల సంరక్షణకు జాగృతి ఆలంబనగా విద్యార్థులు సమాయత్తం కావాలని జిల్లా అటవీ అధికారి సందీప్ కృపాకర్ గుండాల పిలుపు ఇచ్చ్చారు. శ్రీకూర్మం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం అటవీశాఖ, గ్రీన్ మెర్సీ సంస్థ సంయుక్తంగా ఏర్పాటుచేసిన "వన్యప్రాణి సంరక్షణ :జనజగృతి " సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి  విద్యార్థులు,  యువజనులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో సమున్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమం లో దృశ్య, శ్రావణ మాధ్యమాల ద్వారా వన్యప్రాణుల రక్షణకు విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలను గ్రీన్ మెర్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ మూర్తి సోదాహరణ పూర్వకంగా వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, యువజనులు,  ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం చివరిలో "వన్య ప్రాణుల్ని,  అడవుల్ని కాపాడాలంటూ రేంజ్ ఆఫీసర్స్ గోపాలనాయుడు ఆధ్వర్యంలో శ్రీకూర్మం వీధులలో విద్యార్థులు నిర్వహించిన చైతన్య ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.