భువనేశ్వర్: ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది బయటకు తీశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.
లోయలో పడ్డ బస్సు ప్రయాణీకులు మృత్యువాత