హైదరాబాద్ : విల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న భారత్ - న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. స్కోర్లు టై కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లింది. వరసగా రెండు మ్యాచ్ లు సూపర్ ఓవర్ కావడం ఇదే తొలిసారి. 166 పరుగల ఛేదనకు దిగిన కివీస్ 165 పరుగలే చేసింది భారత్ బ్యాటింగ్ ముగిసింది. భారత్ నిర్ణిత 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరి ఓవర్లో కివీస్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా శార్ధూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ టై గా మారింది.సూపర్ ఓవర్ లక్ష్యంను ఐదు బంతుల్లో చేదించి ఇండియా కైవశం చేసుకుని క్రికెట్ అభిమానుల అభిమానం పొందారు.
క్రికెట్ మల్లీ టై సూపర్ ఓవర్ లో ఇండియా విజయం.