బోగస్ ఓట్లకు ఇక చెక్ : కేంద్ర ఎలక్షన్ కమీషనర్

న్యూఢిల్లీ : బోగస్ ఓట్లను నియంత్రించేందుకు ఎన్నికల్ కమీషన్ కొత్త పద్ధతిని తెర పైకి తీసుకు వచ్చింది .ఆధార్ ఓటర్ ఐడీ అనుసంధానికి అనుమతి కోరుతూ ఎన్నికల కమిషన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తయారు చేసేందుకు వీలుగా క్యాబినెట్ నోట్ ను రూపొందిస్తోంది. దీన్ని బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రధాని మోదీ నేతృత్వం లోని కేంద్ర మంత్రి మండలి ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని న్యాయ శాఖ అధికారి తెలియజేశారు.దీనికి సంబంధిత బిల్లును కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆధార్ డేటా ఆధారంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు వీలుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ఆధార్ యాక్ట్ 2016 కు సవరణలు ప్రతిపాదిస్తూ ఎన్నికల కమిషన్ గత ఏడాది ఆగస్టులో కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి ఒక లేఖ రాసింది.ఈసీ ప్రతిపాదించిన సవరణల ప్రకారం ఇప్పటికే ఓటర్ ఐడీ కలిగిన వారిని ఆధార్ నెంబర్ సమర్పించాలని కోరేందుకు కొత్తగా ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసే వారి నుంచి ఆధార్ నెంబర్ అడిగేందుకు ఎలక్టోరల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్ కు అధికారం ఉండేలా ఏర్పాట్లు చేశారు.ఆధార్, ఓటర్ ఐడీ అనుసంధానం వల్ల ఒకే వ్యక్తి పలుచోట ఓటు హక్కు పొందటాన్ని బోగస్ ఓటర్లను అడ్డుకోవచ్చునని ఈసీ వెల్లడిస్తొంది. ఈసీ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన న్యాయశాఖ డేటా గోప్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది.తాము తీసుకున్న జాగ్రత్తల గురించి వివరిస్తూ గత ఏడాది డిసెంబర్ లో న్యాయశాఖకు ఈసీ తెలియజేసిన నేపధ్యంలో న్యాయశాఖ తదుపరి చర్యలు చేపట్టింది. మరోవైపు పాన్ ఆధార్ ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం లేదా వారి ఆదాయాన్ని బట్టి అంతకు మించి మూలం వద్దనే పన్ను కోత పెట్టాలని ఆదాయ పన్ను శాఖ కంపెనీలు సంస్థల యాజమాన్యాలకు గుర్తు చేసింది.20 శాతంకు మించి ఆదాయం ఉంటే సగటు రేటును ప్రామాణికంగా తీసుకొని మూలం వద్ద పన్ను కోత విధించాలని, ఈ మేరకు ఒక సర్క్యులర్ ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గత వారమే అన్ని సంస్థలకు జారీ చేసినట్లు సమాచారం.ఆధార్,ఓటర్ అనుసంధానం లాంటి చర్యలు, కొత్త పద్ధతులతో అయినా కొంత మేరా బోగస్ ఓట్లను కట్టిపెట్టాలని ఎన్నికల కమిషన్ భావిస్తొంది.ఎంత మేరా ఈ చర్యలు సత్ఫలితాలను ఇవ్వనున్నాయో వేచి చూడాలి.