గొట్టాబ్యారేజీ దగ్గర ఘోరమైన ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు నీటిలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద రోడ్డు చోటు చేసుకుంది. మృతులు తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఎన్‌ ఎస్‌ వి పవన్‌ (32), ఖమ్మం జిల్లాకు చెందిన బి. చంద్ర (45) గా తెలుస్తోంది. వీరు విశాఖపట్నంలోని కోరమాండల్‌ ఫెర్టిలైజర్‌ సంస్థలో మేనేజర్లుగా పని చేస్తున్నారు. ఈ ఇద్దరు మరో ముగ్గురితో కలిసి ఒడిశాలోని గజపతి జిల్లా సెంచూరియన్‌ యునివర్సిటీలో కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌ మీటింగుకు వెళ్లారు.మీటింగ్ ముగించుకొని తిరిగి విశాఖ వస్తుండగా. గొట్టా బ్యారేజీ వద్ద ఉన్న వంశధార ఎడమ కాలువలో వారి వాహనం బోల్తా పడింది.ఈ ప్రమాదంలో పవన్ , చంద్ర లిద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించారు.