ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు

భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈస్టర్న్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2792 ఖాళీలను ప్రకటించింది. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులున్నాయి. ఈస్టర్న్ రైల్వేలోని హౌరా, మాల్దా, జమల్పూర్, పశ్చిమ బెంగాల్ లాంటి డివిజన్లలో ఈ పోస్టుల్ని నియమించనుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు మార్చి 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు http://www.rrcer.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.


Eastern Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 2792


హౌరా డివిజన్- 659


సీల్దా డివిజన్- 526


మాల్దా డివిజన్- 101


అసన్సోల్ డివిజన్- 412


కాంచ్రపర డివిజన్- 206


లిలువా డివిజన్- 204


జమల్పూర్ డివిజన్- 684


Eastern Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 14 ఉదయం 10 గంటలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 13


ఎంపికైనవారి జాబితా వెల్లడి- 2020 మార్చి 30


విద్యార్హత- 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.