శ్రీకాకుళం : జనవరి 6 : వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలి గ్రామస్తుడు నవురు రామారావు రిమాండ్ ఖైదిగా ఉంటూ మృతి చెందడం పట్ల ఈ నెల 9వ తేదీన మెజిస్టీరియల్ విచారణ జరుపుతున్నట్లు శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ యం.వి రమణ తెలిపారు. ఈ మేరకు సోమ వారం ఒక ప్రకటన విడుదల చేసారు. నవురు రామారావు, తండ్రి లేటు అప్పలనాయుడును అంపోలు జిల్లా జైలుకు రిమాండ్ ఖైది (నెం.5294)గా 2019 జనవరి 17వ తేదీన తరలించడం జరిగిందని, 2019 అక్టోబరు 3వ తేదీన అన్ లాకింగ్ డ్యూటీలో ఉంటూ ఉదయం 6.30 గంటల సమయంలో చెట్టుకు లుంగీతో ఉరి వేసుకుని చనిపోవడం జరిగిందన్నారు. శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ లో చేర్పించగా, శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శవపంచనామాను పర్యవేక్షించి మరణించిన నవురు రామారావు శవంను గార పోలీస్ స్టేషన్ కు చెందిన పీ.సి.నెం.936 యస్.రామకృష్ణకు అప్పగించడం జరిగింది. పోలీసు శాఖ శవంను రామారావు కుటుంబ సుభ్యలకు అప్పగించడం జరిగిందని చెప్పారు. రిమాండ్ ఖైదీ మృతి పట్ల శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్టేట్ వారు, మేజిస్టియల్ విచారణ నిర్వహించవలసినదిగా శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మేజిస్టేట్ కు ఉత్తర్వులు జారీ చేసారని వివరించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి ఉత్తర్వుల మేరకు ఈ నెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో మెజిస్టీరియల్ విచారణ చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై సమాచారం కలిగి ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, సాక్యులు విచారణకు హాజరై తగు సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు. నవిరి అప్పల సూరమ్మ భర్త లేట్ రామారావు, నగర యల్లయ్య తండ్రి పోతయ్య , సవిరి అప్పల నాయుడు తండ్రి లేట్ నర్సింహులు, నవీరి నాగు తండ్రి నర్సింహులు, నవిరి హరి తండ్రి అప్పారావు లేట్, మొదలగు కుటుంబీకులు, దగ్గర రక్త బంధువులు, సాక్షులైన నవిరి నాగు తండ్రి నర్సింహులు, నవిరి హరి తండ్రి అప్పారావు లేట్, యస్. రాజబాబు తదితరులు మరియు సాక్ష్యం ఇచ్చుటకు ఇష్టపడిన వారెవరైనను సదరు విదారణకు హాజరుకావచ్చునని ప్రకటనలో తెలిపారు.
9వ తేదీన మెజిస్టీరియల్ విచారణ