చేప కడుపులో 9 పిల్లలు !

రాజమండ్రి : కూర కోసం సొరచేపను కోయగానే పొట్ట నుంచి 9 పిల్లలు బయటకు వచ్చి ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన ఇది. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో ఓ మహిళ కూర వండేందుకు సొర చేపను కత్తితో కోశారు. దాని పొట్టలో నుంచి వరుసగా తొమ్మిది పిల్లచేపలు బయటపడ్డాయి. అంత చిన్న చేప కడుపులో అన్ని పిల్లలు ఉండటాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ విషయమై కాకినాడ మత్స్యశాఖ అభివృద్ధి అధికారి లక్ష్మణ్‌ కుమార్‌ని సంప్రదించగా ఇతర చేపలు గుడ్లు పెడితే, సొరజాతికి చెందినవి ఒక్కోటీ ఏడు నుంచి పన్నెండు దాకా పిల్లల్ని పెడతాయన్నారు.