సూపర్‌స్టార్ మహేశ్ ఈ సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. సినిమా ప్రమోషన్స్ అంతా పూర్తి చేసుకున్న మహేశ్ కుటుంబంతో కలిసి అమెరికా పయనమయ్యారు. రెండు నెలలు పాటు అమెరికాలోనే మహేశ్ ఉంటారని వార్తలు కూడా వచ్చాయి. అయితే మహేశ్ అమెరికా వెళ్లడానికి అసలు కారణం వేరే ఉందంటూ మరికొన్ని వార్తలు వినపడుతున్నాయి.గుసగుసల ప్రకారం మహేశ్ మోకాలి ఆపరేషన్ జరగనుందట. ఆగడు షూటింగ్ సమయంలో ఆయన కాలికి గాయమైందట. ఆ గాయం ఇబ్బంది పెడుతూ వచ్చిందట. మరి ఇబ్బందిగా మారకముందే జాగ్రత్త అవసరమని మహేశ్ భావించి ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వెళ్లాడని టాక్. ఆపరేషన్ సహా ఐదారు నెలలు మహేశ్ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారని టాక్. అంతా సెట్ అయిన తర్వాతే మహేశ్ తదుపరి సినిమా సెట్స్ పైకి వెళుతుందని వార్తలు వినపడుతున్నాయి.
మహేష్ బాబు ఇంట్లో విషాదం