అందరూ సమన్వయంతో బాధ్యతలు నిర్వహించాలి : జె.డి.ఈశ్వరరావు

శ్రీకాకుళం : గ్రామసచివాలయాల్లో పశు సంవర్ధకశాఖ లేదా మత్సశాఖ తరుపున ఒక సహాయకుడు మాత్రమే వుంటారు కనుక ఇరు శాఖలు సమన్వయం తో బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా పశు సంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డా.ఈశ్వరరావు పిలుపు నిచ్చారు. స్థానిక జిల్లా పశు సంవర్ధకశాఖ శిక్షణా కేంద్రంలో  మత్సశాఖ సహాయకులకు పశు సంవర్ధకశాఖ పై అవగాహన కొరకు నిర్వహిస్తున్న 2 రోజుల శిక్షణా తరగతులు ను ఆయన ప్రారంభించారు. గ్రామ సచివాలయంల్లో మత్స్యకారులు ఎక్కువగా వున్న గ్రామాల్లో మత్యశాఖ సహాయకులను, మిగిలిన గ్రామాల్లో పశు సంవర్ధకశాఖ సహాయకులను ప్రభుత్వం నియమించింది కనుక పశు సంవర్ధక సహాయకుడు లేని చోట మత్సశాఖ సహాయకుడు ఆ విధులు నిర్వహించాలని ఇందుకు ఈ రెండు రోజుల శిక్షణ లో మెళకువలు నేర్చుకోవాలి అని మత్యశాఖ సంయుక్త సంచాలకులు వి.వి.కృషమూర్తి అన్నారు.గ్రామ సచివాలయంలో  పశు సంవర్ధకశాఖ లేదా మత్య శాఖ లో ఎదో ఒకరు మాత్రమే వుంటారు కనుక వీరికి ఒకరి శాఖపై ఇక్కొకరికి అవగాహన కొరకు పశు సంవర్ధకశాఖ వారు మత్సశాఖ వారికి,మత్సశాఖ వారికి పశు సంవర్ధకశాఖ వారు 2 రోజులు శిక్షణ ఇస్తారు.పశు సంవర్ధకశాఖ సహాయకుని విధులు, బాధ్యతలు, పశు సంవర్ధక పథకాలు వివరాలు,పశు పోషణ, వ్యాధుల నివారణ పై సమగ్రమైన సమాచారాన్ని జిల్లా శిక్షణ కేంద్రం ఉప సంచాలకులు డాక్టరు మాదిన ప్రసాదరావు శిక్షణ ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాల్లోను, ఫిర్యాదులు పరిష్కరంలో నిర్వహించవలసిన విధివిధానాలు తో పాటు రైతులతో సమన్వయం పరుచుకొని,శాస్ట్రీయ సాంకేతిక అంశాల్లో రైతులకు తగిన సూచనలు, సలహాపై తగిన సమాచారాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు,డాక్టరు  జగన్నాధం, సహాయసంచాకులు డా.మాణిక్యాలరావు, డాక్టరు  శ్రీనివాస్ మత్సశాఖ సహాయ సంచాలకులు డాక్టరు సత్యనారాయణ  పాల్గొన్నారు.