నేను త్వరలో చచ్చిపోతాను.టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.

ఎప్పుడూ మీడియాతోపాటు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలుగు హీరోయిన్ మాధవీ లత. 'నచ్చావులే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అనేక సామాజిక అంశాల పట్ల ఆమె స్పందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా. అప్పుడప్పుడు టీవీల్లో జరిగే డిస్కషన్స్‌లో మాధవీ లత ప్రత్యక్షమవుతుంటుంది. ఇక తన సోషల్ మీడియా పేజ్‌లో మాత్రం ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజాగా మాధవీలత చేసిన పెట్టిన ఓ ఫేస్ బుక్ పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది. అందులో ఆమె తనకు అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని త్వరలోనే నేను కూడా చచ్చిపోతానని రాసింది. ఎదో ఒక రోజు ప్రేమ సినిమాలో హీరోయిన్ రేవతి చనిపోయినట్లు తానుకూడా ఏ మందులు పనిచేయక ఒకరోజు చనిపోతానని తన ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ చెబుతూ ఉంటానని పేర్కొంది.ఆ సినిమాలో హీరోయిన్ వేసుకున్నట్లు తాను ప్రతీ దానికి నిత్యం ఏదో ఓక మెడిసన్స్ వేసుకుంటూ ఉంటానని తెలిపింది. ఏదో ఒక రోజు ఏ మందు పనిచేయక తాను కూడా చనిపోతానని తెలిపింది. తనకు మైగ్రేన్ తలనొప్పి,జలుబు, జ్వరం, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నానని తెలిపింది.అయితే మాధవీ లత పెట్టిన ఈ ఫేస్ బుక్ పోస్టుపై ఆమె అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. జీవితంలో ఎవరికైనా ఇలాంటి కష్టాలు కామన్ అని ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ మాత్రం దానికే చనిపోతారా అని భరోసా ఇస్తున్నారు. కొందరైతే తమకు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరికొందరు బీ పాజిటివ్.. అంతా మంచే జరుగుతుందని మద్దతు ఇస్తున్నారు. ఇంకొందరు రెస్ట్ తీసుకో అంటూ మాధవీ లతకు సలహాలు ఇస్తున్నారు.