శ్రీకాకుళం : జనవరి 17 : జిల్లాలో ధాన్యం కొనుగోళుపై సమస్యలు ఉంటే రైతులు తెలియజేయాలని జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అన్నారు. డయల్ యువర్ జెసి కార్యక్రమాన్ని శుక్ర వారం కలెక్టర్ కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళు, విక్రయాలపై సమస్యల ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న సంగతి విదితమే. రైతులు ధాన్యం కొనుగోళుపై సందేహాలు నివృత్తి చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళు కేంద్రాల విధానాలపై అవగాహన పెంపొందించుటకోవాలని కోరారు. ధాన్యం కొనుగోళు కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ధేశాలు జారీ చేసిందని ఆ మేరకు ధాన్యం కొనుగోళు కేంద్రాలు పనిచేస్తాయని చెప్పారు. ధాన్యం కొనుగోళు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే ముందుగానే రైతులు నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిది పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా తేమ శాతం నిర్ధారించుకోవాలని అందుకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరవేయాలని అన్నారు. పిపిసిలలో కొనుగోళు చేసిన 48 గంటల్లో చెల్లంపులు జరుపుటకు అన్ని చర్యలు చేపట్టామని జెసి చెప్పారు. పిపిసిలకు తీసుకువచ్చిన ధాన్యానికి రవాణా ఛార్జీలను సైతం చెల్లిస్తున్నామని అన్నారు. రైతులకు మద్ధతు ధర కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జెసి స్పష్టం చేసారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధుతు ధరకు మాత్రమే విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి జి.నాగేశ్వర రావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఏ.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు సమస్య ఉంటే తెలపండి