దేశానికి రెండో రాజధానిగా అమరావతి ? ? ?

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్ర నాయకులు ఒక విధమైన ఆలోచనలతో ముందుకు సాగుతుండగా... కేంద్రం దక్షిణాదిన 'పాగా' వేయటానికి సంసిద్దమైయినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా అమరావతిని దేశ రెండవ రాజధానిగా చేస్తే 'ఎలా ఉంటుంది..?' అనే కోణంలో నిశ్శబ్దంగా కసరత్తులు చేస్తోంది. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన అమరావతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో మరింత గట్టిగా పాతుకుపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.


ఎలా ప్రయోజనం...


తెలంగాణ, చత్తీస్ గడ్, కర్నాటక, తమిళనాడు, ఒడిషా, కేరళ, పాండిచ్చేరిలకు అమరావతి దగ్గరలో ఉంటుంది. అంతేకాదు... ఇప్పటికే వేలాది ఎకరాలు అందుబాటులో ఉంది. దీనికి తోడు భవనాలున్నాయి. ఆంటే పెద్దగా అదనపు ఖర్చు లేకుండా దేశానికి రెండవ రాజధానిగా అమరావతిని చేయాలని కేంద్రంలోని పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. భాజపా ట్రబుల్ షూటర్ అమిత్ షా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు వినవస్తోంది.


ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. అయితే... కేంద్ర హోంశాఖ వర్గాలు మాత్రం ఈ విషయమై పెదవి విప్పడంలేదు.


దేశ రెండో రాజధానిగా 'అమరావతి' ప్లాన్ వల్ల అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పార్టీలను దెబ్బ కొట్టవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా... తమిళనాట రజనీతో అనుబంధం


పెనవేసుకోవడానికి కూడా పనికొస్తుందని భావిస్తున్నారు.


యోచిస్తున్నాం... బాల్ రాజ్ నూనె, భాజపా సమన్వయ కర్త :


దేశానికి రెండు రాజధానులు అవసరమా..? అవసరమైతే... దక్షిణాదిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, అమరావతిలపై కేంద్రం అధ్యయనం చేసి నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలు, నాయకులు అంతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని వెల్లడించారు.