నేటి నుండి వీరు ప్రభుత్వ ఉద్యోగులు

అమరావతి :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 51,488 మంది ఆర్టీసీ కార్మికుల కల నెరవేరింది. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నోటిఫికేషన్ లో జనవరి 1వ తేదీని అపాయింట్ మెంట్ డేగా పరిగణిస్తూ జారీ చేసింది. ప్రభుత్వ ఖజానా నుండి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు తీసుకోనున్నారు. ఈ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చట్టం 2019 ప్రకారం విడుదల చేసింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రజా రవాణా ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను పరిగణిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ కార్మికులు నేరుగా ఖజానా నుండి జీతాలను అందుకోనున్నారు.