శ్రీకాకుళం : జనవరి 10 : జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఎన్. రమేష్ కుమార్ అన్నారు. శుక్ర వారం జిల్లా కలెక్టర్ లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఎన్. రమేష్ కుమార్ రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్ తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేసినప్ఫటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, పకడ్బందీగా ప్రవర్తన నియమావళి అమలు చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు. బాలట్ పేపర్ల ముద్రణ, ఓటరు జాబితా, పోలింగ్ సిబ్బంది అవసరాలు, పోలీసు బందోబస్తు తదితర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పోలీసు సూపరింటెండెంట్ ఆర్.ఎన్. అమ్మి రెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ జి.చక్రధర రావు, డీపీఓ వి.రవి కుమార్, అర్దబ్ల్యూఎస్ ఎస్ఇ టి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్షా అభియాన్ ఇఇ వి.వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
జెడ్పిటిసి,ఎం.పి.టి.సి ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధం కావాలి – రాష్ట్ర ఎన్నికల సంఘం