ఆర్.టి .ఓ . ఆఫీసులో అలసత్వం .అడిగితే దౌర్జణ్యం.

విశాఖ : స్థానిక రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో సిబ్బందిపై ప్రజలు విసిగి వారి పని విధానం పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికీ మద్యవర్థుల ద్వారా వచ్చిన పనులు వేగవంతంగా జరుగుతుంది ఎవరైనా నేరుగా ఏదైనా పనిపై వస్తే అది నెలలు తరబడి తిప్పుతూ కార్యాలయ సిబ్బంది  విసిగిస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు.ఒక టూ వీలర్ ఫైనాన్సియల్ క్లియరెన్సు కావాలన్నా మద్యవర్తులద్వారా ముడుపులు ముట్టచెప్పవలసిందే. అలా కాదని నేరుగా ఎవరైనా అప్లై చేస్తే పోస్టల్ స్టాంపులు లేవని, కార్డులు లేవని నెలల తరబడి తిప్పుతూ వారిని విసిగించి ఎలాగైనా ఎంతో కొంత ముడుపులు తీసుకొని పనులు చేస్తున్నారని కార్యాలయానికి వచ్చిన ప్రజలు గుసగుసలాడుతున్నారు. వీటిపై పై అధికారులు చెప్పిన క్రింది స్థాయి ఉద్యోగులు వినకుండా వారి పని వారే చేస్తున్నారు అని అనుకోవడం తుది మెరుపు.వీరిపై ప్రభుత్వం స్ఫందించి తగు చర్యలు తీసుకుని ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నారు. అది తెలిసి కార్యాలయాన్ని మా కళింగ రాజ్యం  సందర్శించినది.అంతే కాక కార్యాలయం పనివేళలు సక్రమంగా లేవని ఎవరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో అందులో పనిచేసే సిబ్బందికే తెలియదు అని కళింగ రాజ్యం ఎడిటర్ తో చెప్పడం తుదిమెరుపు.