శ్రీకాకుళం, 71వ భారత గణతంత్రదినోత్సవం వేడుకలు సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఏర్పాటు చేసిన జెండావందనం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించి, జిల్లాలో సాధించిన ప్రగతి, ప్రభుత్వ పధకాలు అమలుపైన జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశంను ఇచ్చారు. ఈసందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. పోలాకి కే.జీ.బి.వి పాఠశాల నుండి 45 విద్యార్ధులు ప్రదర్శించిన ఎలుగెత్తి పాడరా వందేమాతరం నృత్యప్రదర్శన మొదటి బహుమతిని గెలుచుకోగా, తిమ్మరాజు నీరజ శిష్యురాలు షర్మిల దర్శికత్వంలో 80 మంది విద్యార్ధులతో సాయి విద్యామందిర్ విద్యార్ధులు ప్రదర్శించిన జల్ అభియాన్ (నీటి సంరక్షణపై) నృత్యరూపకం రెండవ బహుమతిని గెలుచుకుంది. సీతంపేట ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్దులు ప్రదర్శించిన కొండాకోనల్లో అడవీ వెన్నెల్లో అసంస్కృతిక కార్యక్రమం మూడవ బహుమతిని గెలుచుకుంది. అంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పెదపాడు విద్యార్ధినిలు స్వచ్చభారత్ పైన, శ్రీకాకుళం గవర్నమెంటు విద్యార్ధులు ఎందరెందరో పుణ్యపురుషులు నృత్యరూపకం, రఘుపాత్రుని శ్రీకాంత్ ధర్శకత్వంలో పుషోత్తనగర కాలనీ న్యూసెంట్రల్ స్కూల్ విద్యార్ధినిలు సలాం ఇండియా, గీతాంజలీ పబ్లిక్ స్కూలు విద్యార్ధులు, సంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలో పాల్గొన్నారు.
శకటాలు ప్రదర్శన – గృహనిర్మాణ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, విద్యా శాఖ, బి.సి. కార్పొరేషన్, ఆర్. డబ్ల్యూ. ఎస్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వంశధార(నీటిపారుదల శాఖ) వ్యవసాయ శాఖ, పౌర సరఫరాలు, జిల్లా పరిషత్ సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ శకటాలను ప్రదర్శించగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రదమ బహుమతి, పౌర సరఫరాల శాఖకు ద్వితీయ బహుమి, సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ తృతీయ బహుమతి గెలుపొందాయి.
వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జబిషన్ స్టాల్స్ ను జిల్లా కలెక్టరు సందర్శంచారు. ఈ సందర్భంగా బి. సి కార్పొరేషన్ ద్వారా వివిధ పధకాలు కింది మంజూరు చేసిన రూణాలు రూ. ఒక కోటి 30 లక్షలు, ఎస్. సి. కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన రూ. 89 లక్షలు, స్త్రీ నిధి కింద పట్టణ మహిళా సమాఖ్యకు జీరో వడ్డీగా మంజూచేసిన రూ 8 కోట్ల 17 లక్షల 91 వేయి 472 రూపాయలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన రూ. 108 కోట్ల 71 లక్ష 64 వేల రూపాయల చెక్కలను జిల్లా కలెక్టర్ అందజేశారు.