గ్రామ వ్యవసాయ సహాయకుల శిక్షణా సమాచార దీపిక కరపత్రం ఆవిష్కరణ

శ్రీకాకుళం : జనవరి 6:వ్యవసాయ శాఖ రూపొందించిన గ్రామ వ్యవసాయ సహాయకుల శిక్షణా సమాచార దీపికసహజపధ్ధతులలో ద్రావణాలు మరియు కషాయాల తయారీ విధానం మరియు వినియోగం పుస్తకాలు మరియు వై.ఎస్.ఆర్.రైతు భరోసా – పి.ఎం.కిసాన్ కరపత్రికలను జిల్లా కలెక్టర్ జె.నివాస్  సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం విడుదల చేసారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయదారులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు. వీటిని రైతులు సద్వనియోగపరచుకోవాలని తెలిపారు. కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులుసంయుక్త కలెక్టర్-2 ఆర్.గున్నయ్యజిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధిజిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావుగృహనిర్మాణ సంస్ధ పథక సంచాలకులు టి.వేణుగోపాల్వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జి.శ్రీధర్ఎస్.సి.కార్పోరేషన్బి.సి.కార్పోరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సి.హెచ్.మహాలక్ష్మిజి.రాజారావుజిల్లా విద్యాశాఖాధికారి ఎం.చంద్రకళ.డి.హేండ్లూమ్స్ వి.పద్మఆర్.డబ్ల్యు.ఎస్ఎస్.శ్రీనివాసరావు తదితరులు హాజరైనారు.