న్యూఢిల్లీ : ట్రేడ్ యూనియన్లు, వివిధ రంగాల స్వతంత్ర సంఘాలు నేడు (బుధవారం) భారత్ బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఈ సంఘాలు గత ఏడాది సెప్టెంబరులో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ వైఖరి కార్మికులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించాయి. ప్రభుత్వ విధానాలు, చర్యలు కార్మికుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నాయి.
ట్రేడ్ యూనియన్లు... ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్, యూటీయూసీ , వివిధ రంగాలకు చెంది స్వతంత్ర సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్ పాటించాలని నిర్ణయించాయి. దాదాపు 25 కోట్ల మంది కార్మికులు ఈ బంద్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.
- ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- బంద్ వల్ల దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు ఆటంకాలు ఏర్పడతాయి.
- ప్రైవేటు రంగ బ్యాంకుల సేవలపై బంద్ ప్రభావం పడకపోవచ్చు.
- వివిధ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా బంద్‌లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.
- రవాణా, ఇతర కీలక సేవలకు అంతరాయం ఏర్పడవచ్చు.
- ఓలా, ఊబర్ మినహా కమర్షియల్ ట్యాక్సీలు, ఆటోరిక్షాల సంఘాలు బంద్‌లో పాల్గొంటాయి.
- పాలు, మందులు, అంబులెన్స్ సేవలు, ఆసుపత్రుల సేవలపై ప్రభావం పడదు.