ఉపాది హామీ పనులు వేగవంతం చేయండి

విశాఖ : దేవరాపల్లి : పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని ఎంపిడిఒ సిహెచ్‌ సుబ్బలక్ష్మి తెలిపారు. ఎంపిడిఒ కార్యాలయంలో శనివారం ఉపాధి హామీ పథకం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అన్ని గ్రామ పంచాయతీల్లో కూలీలకు పనులు కల్పించాలన్నారు. ప్రతి కుటుంబానికి వంద రోజులు పని దినాలు కల్పించాలని ఆమె సూచించారు. వచ్చే మార్చి నాటికి లేబర్‌ బడ్జెట్‌ పూర్తి చేసి, 3 లక్షల 63 వేల 725 పని దినాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకు న్నామని పేర్కొన్నారు. ఇంతవరకు 75శాతం కూలీలకు పనులు కల్పించామని ఆమె చెప్పారు.ఇప్పటి వరకు 2 లక్షల 55వేల పని దినాలు కల్పించామని, మిగిలిన పనిదినాలను మార్చి నెలలోపు పూర్తిచేయాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు. ప్రతిరోజు మండలంలో వెయ్యి మందికి పని దినాలు కల్పిస్తున్నామని, ఇకపై రోజుకు 1500 పని దినాలు కల్పించాలని ఆమె చెప్పారు. గ్రామ సచివాలయాలు, పేదలకు ఇళ్ల స్థలాల లెవెలింగ్‌, 16 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ నిర్మాణం, సిసి డ్రెయిన్లు పనులను వేగవంతం చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ కె.తిరుపతిరావు పాల్గొన్నారు.