ఇంటర్నెట్‌డెస్క్: ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఫోన్లకు తన సేవలను నిలిపివేయనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పాత వెర్షన్లు వాడుతున్న వారికి ఈ సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే వినియోగదారుల వాట్సాప్ ఈ సమాచారాన్ని చేరవేసింది.ఫిబ్రవరి 1 నుంచి ఆండ్రాయిడ్ 2.3.7, అంతకంటే ముందు వెర్షన్, ఐఓఎస్ 8, అంతకంటే ముందు వెర్షన్లతో నడుస్తున్న ఫోన్లతో పాటు అన్ని విండోస్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే, ఈ ఫోన్లు వాడుతున్న వినియోగదారులు ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా సేవలను పొందొచ్చు.అలా చేయలేనివారు గడువు పూర్తయ్యేలోగా తమ చాటింగులను బ్యాకప్ తీసుకోవడం మంచిది. ఇలా సేవలను నిలిపివేయడం వల్ల పెద్ద మొత్తంలో వ్యక్తులపై ప్రభావం పడబోదని, ఇప్పటికే చాలా మంది అంతకంటే పైబడిన ఓఎస్ వెర్షన్లకు మారిపోయారని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.
రేపటి నుండి కొన్ని ఫోన్లలో ఇక వాట్సాప్ బంద్.