సర్వ అంధుల ఆశాజ్యోతి లూయీస్ బ్రెయిలీ

శ్రీకాకుళం : జనవరి 4 :అంధుల ఆశాజ్యోతి లూయీస్ బ్రెయిలీ అని జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు ఎ.కళ్యాణ చక్రవర్తి  తెలిపారు.  శనివారం స్థానిక బాపూజీ కళామందిరంలో 211 వ లూయీస్ బ్రెయిలీ జన్మదినోత్సవ వేడుకలు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృధ్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి.విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు జీవన్ బాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు ఎ.కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా డి.ఆర్.డి.ఎ. పి.డి. మాట్లాడుతూ, లూయీస్ బ్రెయిలీ ఆవిష్కరించిన లిపి నేటికీ ఎంతో వుపయోగకరమన్నారు. చీకటి జీవితాలు గడుపుతున్న వారికి బ్రెయిలీ లిపి ద్వారా వెలుగులు నిండాయన్నారు. విభిన్నప్రతిభావంతులుకు పింఛనులు అందిస్తున్నారని, ఉద్యోగాలను కల్పిస్తున్నారని,  మెడికల్ క్యాంపులు, నిర్వహించడం జరుగుతున్నదన్నారు. స్వయం ఉపాధి శిక్షణా తరగతులను రాజాంలోని నెరెడ్ వారు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.యూత్ ఫర్ జాబ్స్ విశాఖపట్నం వారు శ్రీకాకుళంలోనే శిక్షణ నివ్వడానికి ముందుకు వచ్చారని చెప్పారు. సచివాలయ పోస్టులలో విభిన్నప్రతిభావంతుల పోస్టులు ఖాళీగా వున్నాయన్నారు. కొత్త నోటిఫికేషన్ వెలువడుతుందని, సద్వినియోగపరచుకోవాలని చెప్పారు.హౌసింగ్ పి.డి. మాట్లాడుతూ, జీవితంలో అన్ని అవయవాలు కలిగిన వారిని సైతం అధిగమించి సమాజానికి తోడ్పాటు అందిస్తూ విభిన్నప్రతిభావంతులు స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు.జిల్లా ఖజానాధికారి నిర్మలమ్మ మాట్లాడుతూ, అంధులు మనసుతో ప్రపంచాన్ని చూస్తారని అన్నారు. విభిన్న ప్రతిభావంతులను మానవతా ధృక్ఫధంతోను, ప్రేమతోను ఆదరించాలన్నారు. తనకు బధిరురాలైన కుమార్తె  వున్నదని, నిరాశ చెందకుండా ఆమెను ప్రేమతో సాకి, వివిధ రకాల ట్రీట్ మెంట్లను  ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఆమె కుమార్తె మాట్లాడుతున్నదని చెప్పారు. బి.సి.కార్పోరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు మాట్లాడుతూ, విభిన్నప్రతిభావంతులకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. మన జిల్లా కలెక్టర్ విభిన్నప్రతిభావంతుల పట్ల పోజిటివ్ ధృక్పధంతో వున్నారన్నారు. ప్రతీ సోమవారం ట్రైసైకిళ్ళను అందిస్తున్నారన్నారు. శతశాతం ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా తాను 50,116 రూపాయలు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అందిస్తున్నట్లు తెలిపారు. జనార్ధన్నాయుడు,  మాట్లాడుతూ, లూయీస్ బ్రెయిలీ ప్రపంచానికే ఎంతో మేలు చేసారని తెలిపారు.  విభిన్న ప్రతీభావంతుల వెనుక అండగా వున్నవారు చాలా గొప్పవారని అన్నారు. హెలెన్ కిల్లర్ కు వెన్నంటి వున్న టీచర్ సెల్వాన్ చాలా గొప్పవ్యక్తిగా అభివర్ణించారు. నకిలీ వికలాంగులను గుర్తించి నిజమైన విభిన్న ప్రతిభావంతులకు న్యాయం చేయాలని బ్యాక్ లాగ్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని కోరారు. ముందుగా లూయీస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది.అనంతరం 18 మందికి  లేప్ ట్యాప్ లు అందించారు.వివిధ రంగాలలో ప్రసిధ్దులైన విభిన్న ప్రతిభావంతులకు   మెమెంటోలు అందచేసి, సన్మానం చేసారు.ఈ కార్యక్రమానికి హౌసింగ్ పి.డి. టి.వేణుగోపాల్ ,ఎస్.సి. కార్పోరేషన్ ఇ.డి. సి.హెచ్. మహాలక్ష్మి, బి.సి.కార్పోరేషన్ ఇ.డి. జి.రాజారావు, ఎం.కె.మిశ్రా, శ్రీను తదితరులు హాజరైనారు.