అమరావతి : రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతో ఎమ్మెల్సీ పదవికి తెదేపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. చంద్రబాబు, లోకేశ్ తనపై చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మాణిక్యవరప్రసాద్.. ఈరోజు మండలి సమావేశాలకు కూడా హాజరుకాలేదు.
టిడిపికి డొక్కా రాజీనామా