ప్రయాణీకుల బస్సును వెంబడించిన ఏనుగు .

చెన్నై: తమిళనాడులో ప్రయాణికుల బస్సును ఏనుగు వెంబడించింది. దట్టమైన సత్యమంగళం అటవీ ప్రాంతం గుండా బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఏనుగు వెంటాడింది. 30 మంది ప్రయాణికులతో బస్సు దళావారి నుంచి తారామళైకి వెళుతున్నప్పుడు మహారాజాపురం సమీపంలో రోడ్డుకు అడ్డంగా ఏనుగుల గుంపు నిలబడి ఉంది. దీన్ని గమనించిన బస్సు డ్రైవర్‌ ఏనుగులు వెళ్లేవరకు వేచి చూసి బస్సు ముందుకు నడిపాడు. ఈ సమయంలో ఓ ఏనుగు అకస్మాత్తుగా బస్సును వెంబడించింది. ప్రమాదాన్ని పసిగట్టి బస్సును డ్రైవర్‌ వేగంగా పోనివ్వడంతో ప్రయాణికులకు ముప్పు తప్పింది.