శ్రీకాకుళం : జనవరి 5 : వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు శ్రీకాకుళం బొందిలీపురంలోని శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో 24 గంటల పాటు అఖండ శ్రీహరినామ సంకీర్తన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది.ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. యజ్ఞ, యాగాదులన్నింటిలో శ్రీహరి నామ సంకీర్తన మహోన్నతమైనదని, ఈ మహాయజ్ఞం వలన కలియుగ కల్మషాలు నాశనం అవుతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 6గంటల నుండి 7వ తేదీ ఉదయం 6గంటల వరకూ అఖండ శ్రీహరినామ సంకీర్తన మహాయజ్ఞం నిర్వహించబడుతోందని అన్నారు.7వ తేది ఉదయం 9గంటలకు మహానగర సంకీర్తనతో పాటు 56 రకాల ప్రసాదాలు సమర్పణ, మహాప్రసాద వితరణతో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా, ఒడిషా రాష్ట్రాలకు చెందిన వివిధ పీఠాధిపతులు హాజరుకానున్నట్లు ఆ ప్రకటనలో వివరించారు.
అఖండ శ్రీహరినామ సంకీర్తన