కలియుగ భీముడు వర్ధంతి సందర్భంలో

శ్రీకాకుళం : జనవరి 14 :  కలియుగ భీముడు, అభినవ ఇండియన్ హెర్క్యులస్, మల్ల మార్తాండ, జై వీర హనుమాన్ మొదలైన బిరుదులు కలిగిన ఏకైక భారతదేశం యోధుడైన శ్రీ కోడి రామ్మూర్తి వర్ధంతి సందర్భంగా పర్లాకిమిడి శ్రీకృష్ణ చంద్ర గజపతి మహారాజు కళాశాలలో ఆయనకు విద్యార్థులు, శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి  తెలగ యువజన సంఘం, శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష సంఘ ప్రధాన కార్యదర్శి , పెద్దపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న గుండబాల మోహన్ ఆయనకు ఘన నివాళి అర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా కోడి రామ్మూర్తి  శ్రీకాకుళం జిల్లాకి చెందడం వలన జిల్లాకి దేశంలో, ఇటు ప్రపంచంలోనే మన జిల్లాకు పేరు వచ్చిందని, ఆయన అనేక దేశ , విదేశాలలో అనేక బలప్రదర్శన ఇచ్చి దేశంలో, విదేశాల్లో సైతం ప్రజల అభిమానం పొందుకున్నారు, ఆయన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో పుట్టి మద్రాసులోని సయ్యద్ వ్యాయామ శిక్షణ కళాశాలలో శిక్షణ పొంది తిరిగి విజయనగరం మహారాజు ఆ స్థానంలో ఆయన వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశారు, ఎంతోమందికి ఆయన యోగ, మల్ల యుద్ధము, దేహదారుఢ్యం, జమున స్టిక్స్ ,వంటి క్రీడల్లో అనేక మెళుకువలను ఆయన వద్ద ఉన్న విద్యార్థులకు నేర్పారు, విచారకరమైన అంశం ఏమిటంటే , శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో ఆయన పేరు మీదుగా స్టేడియంకు ఆయన పేరు పెట్టారు, కానీ నేటికీ ఇప్పటివరకు స్టేడియం నిర్మాణం పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే విధంగా ఉంది, ఇప్పటికైనా శ్రీకాకుళం జిల్లా సంబంధించిన అధికారులు, క్రీడా శాఖ అధికారులు , రాజకీయ నాయకులు మేల్కొని ఆయనకు సముచిత స్థానం కల్పించవలసిందిగా కోరుతున్నారు.