విజయవాడ: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విజయవాడలో గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన దీక్షలో నారా లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం చినకాకానికి బయలుదేరిన ఆయన్ను పోలీసులు బెంజ్ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్‌తోపాటు ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
లోకేశ్ అరెస్టు