శ్రీకాకుళం : జనవరి 28 : ప్రముఖ రంగస్ధల కళాకారులు యడ్ల గోపాలరావుకు కేంద్ర ప్రభుత్వం “పద్మ శ్రీ” అవార్డు ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ అదపాక సత్యారావు హర్షం వ్యక్తం చేసారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ గోపాలరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కళారంగానికి, ముఖ్యంగా రంగస్ధలానికి గోపాలరావు అందించిన సేవలకు తగిన గుర్తింపు అన్నారు.సత్యహరిచ్చంద్ర నాటకంలో నక్షత్రక పాత్రదారునిగా అనేక ప్రాంతాలలో తను తెలుస్తుంది.అనేక అవార్డులు, సన్మానాలు పొందిన గోపాలరావుకు పద్మ శ్రీ మరొక కలికితురాయిగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. నిగర్వి, ఆత్మీయతలో అందిరిని ఆకట్టుకునే గోపాల రావు జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చారని, మరిన్ని అవార్డులు, రివార్డులు పొందాలని సత్యారావు ఆకాంక్షించారు.
నక్షత్రకునికి "పద్మశ్రీ"