కాలి బూడిదైన టూరిష్ట్ బస్సు

శ్రీకాకుళం : లారీని యాత్రకుల బస్సు ఢీకొని వాహనం పూర్తిగా కాలిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాత్రికుల బస్సు అదుపుతప్పి డివైటర్ ను ఢీకొట్టిన అనంతరం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 50 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం. యాత్రికులు ఉత్తరాఖండ్ నుంచి ఆంధ్రాకు వచ్చినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.