విజయవాడ : మంచి వాతావారణం ఉన్న అమరావతిని విచ్ఛిన్నం చేయాల్సిన అవసరమేంటని సీపీఐ నేత నారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి రాదని అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విజయవాడలోని ధర్నాచౌక్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ ఏం చెయ్యడు చెయ్యనివ్వడు అంటూ విమర్శలు గుప్పించారు.
వైకాపా నేతలకు కావాల్సింది రాజధాని కాదు, విశాఖ సెజ్‌లో వచ్చే లక్షల కోట్లు. అంతేగానీ నేతలకు విశాఖపై ఏ మాత్రం ప్రేమ లేదు. ఆ రోజు రాజధాని కావాలి. 30వేల ఎకరాలు ఉండాలన్న జగన్ ఇప్పుడు మాట మార్చారు. ఆ రోజు అమరావతికి మద్దతు ఇవ్వకుండా ఉండి ఉంటే ఇవాళ ఎవరూ ప్రశ్నించేవారు కాదు. సీఎంకు రాజధానిని మార్చే అర్హత, నైతిక విలువ లేదు. మేం పైసా ఖర్చు కాకుండా రాజధాని నిర్మిస్తాం. మీ మంత్రి వర్గాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళదాం. అప్పుడు మూడు రాజధానులకు మద్దతిస్తాం. ఎన్నికల తర్వాత మీరు రాజధాని ఎక్కడ పెట్టుకున్నా అభ్యంతరం లేదు’’అని నారాయణ అన్నారు.
రాజధాని మార్పుపై మండిపడ్డ సి.పి.ఐ.నారాయణ