మాస్కో: ఓ మైనర్ బాలిక గర్భం దాల్చడం రష్యాలో ఒక సంచలనంగా మారింది. ఇక డాక్టర్లు ఆశ్చర్యానికైతే అంతే లేకుండా పోతోంది. 10 ఏళ్ల వయసున్న తన బాయ్ ఫ్రెండ్ ఇవాన్ తన బడ్డకు తండ్రి అని డారియా(13) చెప్పడంతో నోరెళ్ల డాక్టర్లు బెడుతున్నారు. రష్యాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అంత చిన్న వయసులో శుక్రకణాల ఉత్పత్తి జరగదని డాక్టర్లు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ ఘటనతో డారియా ఇవాన్‌లు రష్యాలో తెగ పాపులర్ అయిపోయారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి టీవీషోలకు కూడా హాజరయ్యారు. అక్కడ ఇవాన్‌ను పరీక్షించిన డాక్టర్లు.. అతడు శారీరకంగా పరిపక్వత చెందలేదని తేల్చిచెప్పారు.ఇక.. గర్భం తొలగించుకునేందుకు డారియా అంగీకరించలేదు. బిడ్డకు జన్మనిచ్చి తీరుతానని స్పష్టం చేసింది. మరో వైపు డారియా తల్లి క్యాన్సర్‌తో పోరాడుతోంది. వ్యాధి చివరి స్టేజీలో ఉంది. అయితే తన కూతరు గర్భం దాల్చడంతో తన జీవించాలనే కాంక్ష మరింత పెరిగిందని ఆమె చెప్పింది. మనవడు పుట్టే వరకూ జీవించి ఉండేందుకు పోరాడుతున్నానని చెప్పింది. అయితే డారియా గర్భం దాల్చడానికి ఇవాన్ కారణమాకాదా అన్నదానిపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. అతడే తండ్రి అని రుజువైతే గనుక.. అతి చిన్న వయసులో తండ్రైన వ్యక్తిగా ఇవాన్ చిరిత్రలో నిలిచిపోతున్నాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు న్యూజిల్యాండ్‌కు చెందిన ఓ బాలుడి పేరిట ఉంది. 2013లో తన స్కూల్ టీచర్‌తో ఉన్న అక్రమసంబంధం కారణంగా అతడు 11 ఏళ్ల వయసులోనే తండ్రైయ్యాడు.
13 ఏళ్ళ బాలిక గర్భం..కారణం తెలిసిన డాక్టర్లు షాక్