శ్రీకాకుళం : గుజరాత్ లోని నాందేడ్ లో ఈ నెల 14 నుంచి 19 వరకూ జరుగనున్న 65వ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్ -14 ఫెన్సింగ్ పోటీలకి రాష్ట్రం నుండి నరసన్నపేటకి చెందిన దిబ్బ మేఘన ఎంపికైంది.గత నెల 24 నుంచి 27 వరకూ కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన అండర్ -14 రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ పోటీలలో మేఘన మంచి ప్రతిభ కనబరిచి స్వర్ణపతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకి రాష్ట్రం నుంచి ఎంపికైంది. ఈమె ఎంపిక పట్ల జిల్లా విద్యా శాఖాధికారి చంద్రకళ,జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.రాజారావు , జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి సుందర్రావు, జిల్లా పి ఇ టి అండ్ పి.డి అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వి.రమణ, కార్యదర్శి ఎం.సాంబమూర్తి,ఫెన్సింగ్ ఎన్ఐఎస్ కోచ్ జోగిపాటి వంశీ,పి.డి భవానీతో పాటు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వైశ్యరాజు మోహన్ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను లు అభినందించారు.
జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-14 ఫెన్సింగ్ పోటీలకు శ్రీకాకుళం మేఘన