మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో భారత్ కైవసం చేసుకుంది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌ను టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ 9 వికెట్లు నష్టపోయి కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.
క్రికెట్ టి20 భారత్ కైవసం