ఆంధ్రప్రదేశ్‌లో 16,208 గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి 2020 జనవరి 31 చివరి తేదీ అని ప్రభుత్వం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువును ఫిబ్రవరి 7 వరకు పొడిగించినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. వివిధ జిల్లాల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం గడువు పొడిగించింది. గ్రేడ్ 2 గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులకు విద్యార్హతలను సడలిస్తూ జనవరి 30న నిర్ణయం తీసుకుంది. దీంతో అర్హతలు ఉన్నవారికి దరఖాస్తు చేసేందుకు ఛాన్స్ ఇవ్వడానికి గడువు పెంచింది. ఇక పంచాయతీ కార్యాలయాల్లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కూడా అవకాశం ఇస్తోంది. వారంతా డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించే ఆలోచనలో ఉంది.ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ ఉన్నవారంతా దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాక అధికారిక ప్రకటన చేయాలని భావిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 16,208 పోస్టుల్ని భర్తీ చేసేందుకు గతనెలలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. http://gramasachivalayam.ap.gov.in/ లేదా http://wardsachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్లలో దరఖాస్తు చేయొచ్చు. గ్రామ సచివాలయాల్లో 14,062 పోస్టులు ఉండగా, వార్డు సచివాలయాల్లో 2,146 ఖాళీలున్నాయి. ఇంటర్ నుంచి విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేయాలి.
పిబ్రవరి 7 వ తేదీ వరకు గడువు .